ఎమ్మెల్యేపై అభ్యంతరకర వ్యాఖ్యలు
08-07-2026 12:17 AM
ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిపై కేసు పెట్టాలని కాంగ్రెస్ ఫిర్యాదు
షాద్నగర్, జులై 7(విజయక్రాంతి): స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంక్ప అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిపై షాద్నగర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నలమోని శ్రీధర్ ఫిర్యాదు చేశారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ఆందోళనలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ప్రజలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు అందిందని స్థానిక సీఐ సీతారాం ధ్రువీకరించారు.






