8 May, 2026 | 1:15 AM

విద్యార్థిని అభినందించిన కలెక్టర్

08-05-2026 12:16 AM

కంగ్టి, మే 7: పదో తరగతి పరీక్షల్లో 574 మార్కులు సాధించిన సాధించిన కంగ్టి కస్తూర్భా పాఠశాల విద్యార్థి పల్లవిని కలెక్టర్ ప్రతిక్ జైన్ అభినందించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ విద్యార్ధికి ప్రశంసాపత్రం, పతకాలతో ప్రోత్సహించారు. ప్ర భుత్వ వసతిగృహల్లో ఉంటూ మంచి మార్కులు సాధించడం అభినందనీయమని, ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో కస్తూర్భా పాఠశాల ఎస్‌ఓ విజయలక్ష్మి ఉన్నారు.