23 July, 2026 | 12:55 AM

విద్యా వ్యవస్థను నాశనం చేసిన కేంద్రం

23-07-2026 12:01 AM
  1. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
  2. ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు

ఇబ్రహీంపట్నం, జూలై 22 (విజయక్రాం తి): కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగే నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఐటీ శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ అలసత్వ విధానాల వల్ల దేశం లో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆయ న మండిపడ్డారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ‘ఛాత్రోన్ కీ గూం జ్’ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనిలతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కేంద్రం విధానాలను విమర్శించారు.