11 June, 2026 | 2:12 AM

హామీల అమలులో రాష్ట్ర సర్కార్ విఫలం

11-06-2026 01:03 AM
  1. కేంద్రం నిధులు ఇస్తున్నా వినియోగించుకోవడం లేదు
  2. బీజేపీ ఎంపీ డీకే అరుణ

షాద్ నగర్, జూన్ 10 (విజయక్రాంతి): కేంద్రం తెలంగాణకు రావలసిన నిధులను నిష్పక్షపాతంగా విడుదల చేస్తోందని, వాటిని సమర్థంగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు.

లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక భాగమని పేర్కొన్న డీకే అరు ణ, 2013లో తాను మంత్రిగా ఉన్న సమయం లో ప్రాజెక్టుకు అవసరమైన జీవోలను జారీ చేయించినట్లు గుర్తు చేశారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసలు రూపురేఖలను మార్చేసిందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు న్నరేళ్లు గడిచినా పెండింగ్ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించలేదన్నారు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో రహదారులు, రైల్వే స్టేషన్లు, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాలు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని డీకే అరుణ చెప్పారు.