11 May, 2026 | 9:10 PM

Breaking News

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •   శివంపేట మండలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ!   •   పాలిసెట్–2026 పరీక్షా ఏర్పాట్లు పూర్తి   •   ప్రధాని మనసు గెలిచిన గరిడేపల్లి 'డప్పు దరువు'   •   జనగణన సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: సర్పంచ్ అక్షరా శ్రీనివాస్   •   మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వానం   •   ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   క్షతగాత్రురాలుకి అండగా చేయూత ట్రస్ట్   •   సమ్మర్ క్యాంప్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

భారత్, పాక్ కుర్రాళ్ల సమరం నేడే

01-02-2026 12:50 AM

అండర్ 19 ప్రపంచకప్

బులవాయో, జనవరి 31 : అండర్ 19 ప్రపంచకప్ 2026లో అసలు సిసలు పోరుకు అంతా సిద్దమైంది. ఆదివారం జింబాబ్వేలోని బులవాయోలో ని క్వీన్స్ స్పోరట్స్ క్లబ్ మైదా నం వేదికగా జరిగే తమ ఆఖరి సూపర్-సిక్స్ మ్యాచలో భారత్, పాకిస్థాన్ జ ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆయు ష్ మాత్రే సారథ్యంలోని భారత యు వ జట్టు వరుసగా మూడు మ్యా చ్‌లు గెలిచి జోరు మీదుండగా.. పాకిస్థాన్ మూడింటిలో రెండు గెలిచింది.

ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్లో పాక్ చేతి లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో భారత కుర్రాళ్లు ఉన్నారు. ఆ మ్యాచ్‌లో టీ మిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని.. పాక్ పేసర్లు కవ్వించ గా.. అతను అదే రీతిలో బదులిచ్చా డు. అయితే ఈ సారి తన బ్యాట్‌తోనే వారికి జవాబివ్వాలని పట్టుదలగా ఉం ది.. ఈమ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే అధికారికంగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.

ఈ క్రమంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టులో వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా, హార్దిక్ రాజ్, అభిజ్ఞాన్ కుండు ఆటగా ళ్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వి హా న్ మల్హోత్రా జింబాబ్వేపై అజేయ శతకంతో చెలరేగగా.. సూర్యవంశీ విధ్వం సకర హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఆరంభాలను అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే  బులవాయో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.