11 May, 2026 | 10:13 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

అర్జున్ టెండూల్కర్ @ 50 వికెట్లు

01-02-2026 12:49 AM

ముంబై, జనవరి 31 : భారత క్రికెట్ దిగ్గ జం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తున్న అర్జున్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 50 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రంజీ ట్రోఫీలో భాగం గా గోవా తరపున ఆడుతున్న అతడు మహారాష్ట్రతో మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించా డు. 2022-23 సీజన్‌లో గోవా తరపున తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అర్జున్ టెండూల్కర్ 50 వికెట్లలో 13 వికెట్లు ఈ సీజన్‌లోనే పడగొట్టాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 50 వికెట్ల మైలురాయి అందుకున్న అర్జున్ తన తండ్రి సచిన్ కన్నా 21 వికెట్లు వెనుకబడే ఉ న్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సచిన్ 71 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే దేశవాళీ క్రికెట్‌లోకి ముంబై తరపున అరంగేట్రం చేసిన అర్జున్ తర్వాత గోవా రంజీ జట్టుకు మారిపోయా డు. అప్పటి నుంచీ పేస్ ఆల్‌రౌండర్‌గా తనను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అర్జున్ ఈ సీజన్‌లో ట్రేడింగ్ ద్వారా లక్నో సూపర్‌జెయింట్స్‌కు వెళ్లాడు.