1 April, 2026 | 2:05 AM

మా బతుకులు.. గిట్లనే..!

01-04-2026 12:46 AM

లొంగిపోయిన పీపుల్స్‌వార్ సభ్యుల మనోవేదన

పునరవాస కల్పనలో జాప్యం 

ఇల్లు, పెన్షన్, భూమి కోసం డిమాండ్లు

ఉమ్మడి జిల్లాలో వెయ్యి మంది బాధితులు 

నిర్మల్, మార్చి ౩౧ (విజయక్రాంతి): అట్టడుగు వర్గాల హక్కుల కోసం మావోయిస్టు ఉద్యమంలో చేరి పోరాడి.. ప్రభుత్వాల పిలు పు మేరకు లొంగిపోయిన మావోయిస్టుల బతుకు మాత్రం మారడం లేదు. లొంగిపోయి న మావోయిస్టులపై ప్రభుత్వం ప్రకటించిన సరెండర్ పాలసీ ఏళ్ళు గడుస్తున్న వారి బతుకులు మారలేదన్న విమర్శలు వస్తున్నాయి.

దీంతో మా బతుకులు.. గింతె న.. అంటూ తమకు ప్రభుత్వం కనీస అవసరాలు పెన్షన్ ఇందిరమ్మ ఇల్లు, దున్నుకోవడానికి భూమి ఉపాధి మార్గం చూపాలని జిల్లాలో లొంగిపోయిన పీపుల్ వార్ సభ్యులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వీరంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ దళాల్లో పని చేయడమే కాకుండా ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో పని చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు లొంగిపోయిన వారే అధికంగా ఉన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నట్టు చెప్తున్నారు 

ఉమ్మడి జిల్లాలో ౧౦౦౦ మంది.. 

ఆదివాసీల అడవుల జిల్లాలో ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది. 1978లో ప్రారంభమైన ఈ ఉద్యమం 2000 వరకు ఉమ్మడి జిల్లాలో పోరాటం కొనసాగింది. అప్పటి ప్రభుత్వాలు ఎన్నో నిర్బంధాలు విధించి నిషేధం వరకు వెళ్లాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉండేది. ఇక్కడ బోథ్, ఇంద్రవెల్లి, పిప్పల్దారి , వాంకిడి, మంగి , సింగపూర్, సిరిపూర్, చెన్నూరు, ఖానాపూర్, మావోయిస్టు దళాలు ఉండేవి.

ఈ దళంలో దళ సభ్యులు సంఘ నాయకులు, పార్టీ సభ్యు లు, కమాండర్లు, జిల్లా కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ, అన్ని క్యాడర్లలో మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై పార్టీ లో ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశారు. అప్పటి టిడిపి ప్రభుత్వం మావోయిస్టులతో రెండుసార్లు చర్చలు  ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది.  మావోయిస్టులు లొంగిపోతే పునరవాసం కల్పించేందు కు సరెండర్ పాలసీని 1993లో తీసుకువచ్చారు. మావోయిస్టులు క్యాడర్‌ను బట్టి లొంగిపోయిన వారికి రివార్డ్ నగదును వారికి ఇస్తామ ని వ్యవసాయ భూమితో పాటు ఉండడానికి ఇల్లు ఉపాధికి మార్గం చూపుతామని ఈ పాల సీ తీసుకొచ్చినట్టు వారు చెప్తున్నారు.

దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 1000 మందిపైగా మావోయిస్టు సభ్యులు పోలీస్ శాఖ ఎదుట లొంగిపోయారు. ఇందులో మహిళలు, యువకులు, రైతు కూలి సంఘం నాయకులు ఉన్నట్టు తెలిపారు. 2001 నుంచి 2025 వరకు సుమారు వివిధ ప్రాంతాల్లో  పాటు ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన మావోయిస్టులు పోలీసుల ముందు తుపాకులు వదిలిపెట్టి లొంగిపోయారు. వీరిపై అనేక కేసులు కూడా ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ప్రతి నెల వీరిపై నిఘా ఉంటుంది.

పోలీస్ స్టేషన్లో ప్రతినెల హాజరు ఇచ్చి రావలసి ఉంటుంది. అయితే మావోయిస్టులతో పూర్తిగా సంబంధాలు తెం చుకొని  గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఊళ్లో ఉంటూ కూలీలుగా. అడ్డా కూలీలుగా, ఇంట్లో పని మనుషులుగా, ఆటో డ్రైవర్లుగా, పాలేరులుగా, పనిచేస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నట్టు చెప్తున్నారు. మావోయిస్టులు లొంగిపో యేందుకు పోలీసులు ఎన్నో విధాలుగా చూపిన శ్రద్ధ.. పునరావాసం కల్పించడంలో చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం మార్గ నిర్దిష్టకాలు.. స్థానిక పరిస్థితులు మరో కారణం. 

కొందరి పరిస్థితులు దుర్భరం 

మావోయిస్టు ఉద్యమంలో ఏళ్ల తరబడి పనిచేసి ప్రభుత్వమిచ్చిన లొంగుబాటు అవకాశాన్ని జన స్రవంతిలో కలిసిన మాజీ మావో యిస్టుల బతుకు కొన్ని కుటుంబాలు దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుక్త వయసులోని మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితులై ఉద్యమంలో 20 ఏళ్లకు పైగా పనిచేసి లొంగిపోయిన చాలా నెలలు గడుస్తున్న ఇప్పటికీ సరైన ప్రభుత్వ ప్రోత్సా హం అందడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం కొందరికి ఇళ్ల స్థలాలు భూములు ఇచ్చినాప్పటికీ చేతికి పట్టాలు ఇవ్వలేదు.

కొందరికి జాగాలు ఇస్తే అవి అక్రమార్కుల చేతిలో వెళ్లిపోయాయి. ప్రభుత్వం జిల్లా అధికారులకు తమకు పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ఉపాధి రుణం అందించాలని నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికా రులు మాత్రం వారి వినతి పత్రాలను స్వీకరిం చి ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఇప్పటివరకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్  ప్రభుత్వం మావోయిస్టు పునరావాస ప్రక్రియపై స్పష్టమైన హామీ ఇచ్చినట్టువారు గుర్తు చేస్తున్నారు. 

ప్రభుత్వ దృష్టికి సమస్యలు ..

మావోయిస్టు ఉద్యమంలో పాల్గొని లొంగుబాటుతో పునరావాసం కోసం ఎదురుచూస్తున్న మాజీ మావోయిస్టు పార్టీ సభ్యులు పీపుల్స్ వార్ సభ్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పు డు ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో ఆదిలాబాద్ టు ఖమ్మం పాదయాత్ర చేసిన ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.

రాబోయే ఇందిరమ్మ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇస్తూనే లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంపై స్పష్ట మైన హామీతో ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేర్చారు. ఉమ్మడి జిల్లాలో అజ య్ పలువురు భట్టి పాదయాత్రలు పాల్గొన్నా రు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకు లొంగిన పీపుల్స్‌వార్ సభ్యులు వారి జీవస్థితికి గతులు పునరావాస ప్రక్రియలో జరుగుతున్న జాప్యం, పెన్షన్ అమలు డిమాండ్లను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు చెప్తున్నారు.

కూలి పనులకుపోతున్న.. 

మాది గిరిజన కుటుంబం. మావోయిస్టు పార్టీలో చేరి సింగపూర్ దళ సభ్యురాలుగా, ఆ తర్వాత ఛత్తీస్‌గడ్‌లో పనిచేసిన. 18 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉద్యమం కోసం పనిచేసే 2019లో సరెండర్ పాలసీ కోసం ఎస్పీ శశిధర్ రాజు ముందు లొంగిపోయిన. ఇప్పటివరకు పునరావసం సాయం అందలే. సొంత ఇల్లు లేదు, కట్టుకుందామంటే జాగలేదు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఇప్పటికి ఎన్నోసార్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చిన. అధికా రులు హామీ ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదు. 

పంద్రం గంగుబాయి అలియాస్ లలిత 

బురదపల్లి, మామడ మండలం 

ఇంటి స్థలం కబ్జా చేసిండ్రు 

మాది కడెం. సింగపూర్ దళంలో పదేళ్లు పనిచేసిన. కడెం దస్తురాబాద్ పెంబి ప్రాంతంలో ఎన్నోసార్లు అజ్ఞాతంలో ఉంటూ పోరాటం చేసి న. లొంగిపోతే ఇంటి స్థలం ఇచ్చిండ్రు. ఆ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటు ర్రు. అధికారులకు చెప్పిన తన వద్ద కాగి తం మాత్రమే ఉండగా ఆన్లైన్లో పేరు లేకపోవడం తో ఏమి చేయలేమని చెప్పుతూ ఇబ్బంది గురి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి.

అమలకొండ మల్లేష్ 

అలియాస్ అంజన్న, కడెం

సరెండర్ పాలసీని అమలు చేయాలి 

మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు లొంగిపోతే సరెండర్ పాలసీని అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీ నిలబెట్టుకోవాలి. సరెండర్ పాలసీపై ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోను అమలు చేస్తే ఉమ్మ డి జిల్లాలో దుర్భరస్థితిగతులు ఎదుర్కొంటున్న మాజీ మావోయిస్టులకు కొంత జీవనోపాధి మెరుగుపడుతుంది. 

 బి.అజయ్, ఉమ్మడి జిల్లా మాజీ  నేత, (మాజీ దళ కమాండర్)

కుటుంబ పరిస్థితి బాగాలేదు 

తెలిసి తెలియని వయసులో అప్పటి మావోయిస్టు ఉద్యమాలపై ఆకర్షితులై పీపు ల్స్‌వార్‌లో పనిచేసిన. మా అక్క కంతి లింగప్ప బావ భాస్కర్ దంపతు లు ఉద్యమంలో ఉండి ఇటీవలే ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. 2014లో అప్పటి ఎస్పీ విష్ణు వారియర్ ఎదుట నేను లొం గిపోయిన. సొంత ఇల్లు లేదు. చేద్దామం టే వ్యవసాయం లేదు. కుటుం బం పరిస్థితి దారుణంగా ఉంది. లొంగిపోతే ఆదుకుంటామని చెప్పిండ్రు. అదే అడుగుతున్నాం మాకు న్యాయం చేయాలి. 

కంతి రవీందర్ అలియాస్ సురేష్,

లక్ష్మీ సాగర్ గ్రామం