బొట్టు పెట్టి.. స్వీట్లు తినిపించి...
15-06-2026 05:23 PM
- విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
జన్నారం,(విజయక్రాంతి): నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు బొట్టు పెట్టి.., పూలు అందజేసి.. మిఠాయిలు తినిపించి పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సర్పంచులు స్వాగతం పలికారు. నూతనంగా చేరిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను ఈ సందర్భంగా అందజేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ప్రయోజకులు కావాలని కోరారు.






