7 August, 2026 | 5:24 AM

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ఆలయ కమిటీ ఆహ్వానం

07-08-2026 01:07 AM

ఎల్లారెడ్డి, ఆగస్ట్ 6 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించనున్న బోనాల పండుగ ఉత్సవాలకు విచ్చేసి పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మదన్ మోహన్ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానాన్ని స్వీకరిస్తూ, రానున్న ఆదివారం జరిగే బోనాల మహోత్సవాల్లో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ  అధ్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ , పాండ్రే వినోద్ , పప్పు వెంకటేశం గ, ప్యాలాల రాములు,  మంచిర్యాల విద్యాసాగర్,  గాదె తిరుపతి భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.