7 August, 2026 | 4:40 AM

తెలంగాణ సిద్ధాంతాన్ని, ఆకాంక్షను రగిలించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్

07-08-2026 01:06 AM

పలువురు నివాళులర్పించిన నాయకులు, అధికారులు

కామారెడ్డి, ఆగస్ట్ 6 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధాంతాన్ని ఆకాంక్షను రగిలించిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆన్నారు. జయశంకర్ జయంతి వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత పితామహుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయ్ కుమార్ అన్నారు. కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జూ కంటి ప్రభాకర్ రెడ్డి, స్వర్ణకార సంఘం ప్రతినిధులు, జేఏసీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పర్వతాలు, జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈవో చందర్ నాయక్, కాంగ్రెస్, బిజెపి, కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లావ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జగన్నాథం, క్యాతం సిద్ధిరాములు, స్వర్ణకార సంఘం ప్రతినిధి బ్రహ్మం, శేఖర్, చక్రం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ ఏ. సుధాకర్, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, రాజేందర్, డాక్టర్. రమేష్, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.