7 August, 2026 | 3:33 AM

రూపారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి

07-08-2026 02:34 AM

నార్సింగి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళల ఆందోళన.. 

రాజేంద్రనగర్, ఆగస్టు 6 (విజయ క్రాంతి): నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ఉద్రికత పరిస్థితులు నెలకొన్నాయి. రూప రెడ్డి వ్యవహారంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేపట్టారు.

కోట్ల రూపాయలు తీసుకుని తమను మోసం చేసిన బిఆర్‌ఎస్ మహిళా విభాగం మణికొండ అధ్యక్షురాలు రూపా రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పోలీసులు వెంటనే రూపా రెడ్డిని అరెస్టు చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు.

తమ ఫిర్యాదులపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తo గా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.