7 August, 2026 | 3:32 AM

తెలంగాణ ఆత్మగౌరవం జయశంకర్ సార్

07-08-2026 01:33 AM
  1. రాజకీయ వాటా సాధిస్తేనే ఆయనకు నిజమైన నివాళి
  2. మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలని, ఆయన కలలు కన్న సామాజిక న్యాయం, స మాన రాజకీయ వాటా, ప్రజాస్వామ్య తెలంగాణ సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అఖిల భార త బహుజన సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డా. జె. పూర్ణచం ద్రరావు అన్నారు.

బీసీ టైమ్స్, బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా లక్డీకపూల్‌లోని మీడియా సెం టర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కార్యక్రమానికి బీసీ టైమ్స్ సంపాదకులు సంగెం సూ ర్యారావు అధ్యక్షత వహించారు. ప్రముఖ బ హుజన కవి, గాయకుడు యాసారపు రాం బాబు రచించిన జన గళాల గర్జన, జయశంకర్ అమర్ హై గీతాన్ని ఆవిష్కరించారు. గా యకుడు కిషోర్ ఆ గీతాన్ని డిజిటలైజ్ చేశారు.

డా. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. జయశంకర్  తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన మహనీయుడని గుర్తు చేశారు.  తెలంగా ణ చరిత్రలో ఆయనకు దక్కాల్సిన స్థానం, గౌరవం పూర్తిస్థాయిలో లభించలేదన్నారు.  ప్రతి సామాజిక వర్గానికి జనా భా నిష్పత్తిలో రాజకీయ వాటా కల్పించినప్పుడే జయశంకర్ కలలుగన్న సామాజిక న్యాయ తెలంగా ణ నిర్మితమవుతుందని పిలుపునిచ్చారు.

మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మా ట్లాడుతూ.. జయశంకర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని  గణాంకాలు, ఆధారాల తో దేశానికి నిరూపించినమహామేధావి అని అన్నారు.  ఇంకా సామాజిక తెలంగాణ సాధించా ల్సి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విఠల్, సంగెం సూర్యారావు, బీసీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య, సామాజిక ఉద్యమకారులు పాల్గొన్నారు.