7 August, 2026 | 3:32 AM

క్యా బోల్తీ ప్రజా

07-08-2026 01:03 AM
  1. వచ్చే నెల నుంచి సీజేపీ మరో ఉద్యమం
  2. అణచివేత, నియంతృత్వాలు ఇక కొనసాగవు
  3. సీజేపీ నేత అభిజీత్ దీప్కే

ముంబై, ఆగస్టు 6: విద్యావ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజే పీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నా రు. ఇందులో భాగంగా ‘క్యా బోల్తీ ప్రజా’ (ప్రజలు ఏం చెబుతున్నారు) అనే ఉద్యమాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించబోతు న్నామని, యువత క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి, ఇందులో చేరి తమ ఆలోచనలను పంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిం దని, విద్య లాభార్జన సాధనంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఉద్య మంపై జాతీయస్థాయి ప్రచారం నిర్వహిస్తామని, ప్రజల ఆందోళ నలు, ఆకాంక్షలను అర్థం చేసుకో వడం, అభిప్రాయాలను తీసుకోవడంతోపాటు వ్యవస్థల ప్రక్షాళనే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ మని ప్రకటించారు. సీజేపీ చేపడుతున్న ఉద్యమంపై మీడియా విశ్వసనీయతను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, న్యాయ, మీడి యా, ఈసీ వ్యవస్థలు ప్రజల విశ్వాసం కో ల్పోతున్నాయన్నది వాస్తవమన్నారు.

తర్వా తి దశ ఉద్యమంపై రెండు రోజులుగా మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో వర్క్‌షాప్ నిర్వ హించిన సీజేపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. గత 14 ఏళ్లుగా దేశం అణచివేత, నియంతృత్వాన్ని చూసిందని, కానీ ఇప్పుడు ప్రజల మనసుల్లోని భయం పూర్తిగా తొలగిపోయిందని అన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలు ఇకపై ఎవ్వరికీ భయపడబోరని తెలిపారు. 

తమ పార్టీ సి ద్ధాంతం రాజ్యాంగ విలువల ఆధారంగా ఉంటుందని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం, మహాత్మా గాంధీ అహి ంస, జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత దృక్పథమే తమకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాలు ప్రజల సమస్యల నుంచి దూరమయ్యాయని, ము ఖ్యంగా విద్య, నిరుద్యోగం వంటి అంశాలు చర్చకు రావడం లేదని నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యా సంస్కరణలే తమ తొలి ప్రాధాన్యత అని ప్రకటించిన సీజేపీ నేతలు..

దేశంలో పాఠశాల స్థాయి నుంచే విద్య రోజురోజుకు ఖరీదైనదిగా మారుతోందన్నారు. లక్షల్లో ఫీజులను చెల్లించుకోలేక తల్లిదండ్రులు అగాధంలో, అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగం,  విద్యా సంస్కరణలను దేశవ్యాప్త అతి పెద్ద సమస్యలలో ఒకటని పేర్కొన్నారు. వాటిని వెంటనే సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకటించిన ప్రజా ఉద్యమంపై భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించడంలో ఉద్యమం లో పాల్గొన్నవారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 

దేశ జనాభాలో 60 శాతం మంది యువతేనని జంతర్‌మంతర్ నిరసనలో చాలా మంది పాల్గొన్నారని చెప్పారు. సీజేపీ చేపడుతున్న ఉద్యమంపై మీడియా విశ్వసనీయ తను ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, న్యాయ, మీడి యా, ఈసీ వ్యవస్థలు ప్రజల విశ్వాసం కో ల్పోతున్నాయన్నది వాస్తవమన్నారు. ఈ సంస్థల్లో జవాబుదారీ తనం, నిష్పక్షపాతాన్ని పునరుద్ధరించేందుకే ‘క్యా బోల్తీ ప్రజా’ అనే ఉద్యమాన్ని చేపట్టామని దీప్కే వివరించారు. 

దేశవ్యాప్తంగా సీజేపీ సభ్యత్వ నమోదు

కార్యక్రమాన్ని కూడా అభిజీత్‌దీప్కే ప్రారంభించారు. ఈ ఉద్యమంలో పాల్గొనేవారు క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాలని, తమ నిరసనల్లో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శిస్తూ సభ్యత్వం పూర్తిగా ఉచితమని అన్నారు. ప్రస్తుతం సీజేపీ ఎలాంటి విరాళాలు లేదా క్రౌడ్‌ఫండింగ్ స్వీకరించడం లేదని, ప్రజలు మోసపూరిత ఫండింగ్ కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. కాగా ఆగస్ట్ 5న మీడియాతో మాట్లాడిన దీప్కే తాము రాజకీయా ల్లోకి ప్రవేశించడం లేదని, తమది రాజకీయ పార్టీ కాదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.