ముషీరాబాద్ బోనాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
07-08-2026 02:35 AM
ముషీరాబాద్,ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆషాడమాసం బోనాలను పురస్కరించుకొని ముషీరాబాద్ ఈ నెల 9,10వ తేదీలలో వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆహ్వానించామని ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీ నివాస్ రావులు తెలిపారు.
గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నియో జకవర్గంలోని వివిద అమ్మవారి దేవాలయాల అసోసియేషన్ నాయకులు, యువజన కమిటీ నాయకులు నిర్వహించే బోనాలు, పోతరాజులు, ఫలహార బండ్ల ఊరేగింపుకు కేటీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన కార్డును అందజే శారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.






