పెరగనున్న ఉష్ణోగ్రతలు
వాతావరణ శాఖ అలెర్ట్ జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమేపి ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మూడ్రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉం దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌తోపాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్, మల్కాజిగి రి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆయా జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకా శం ఉందని పేర్కొంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్, ఖమ్మం, నారా యణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని, గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వా ల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.






