15 June, 2026 | 9:56 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మారిషస్‌లో తెలుగు మహా సభలు

09-01-2026 12:00 AM

ముఖ్య సమన్వయకర్తగా పార్థసారథి

డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడి

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో మారిషస్‌లో జరుగబోయే నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలకు ముఖ్య సమన్వయకర్తగా బృందావన పార్థ సారథిను మారిషస్ వారిని నియమించినట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నియామక ఉత్తర్వుల ప్రతిని మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థాన సంయుక్త కార్య నిర్వహణాధికారి వెంకన్న చౌదరి చేతుల మీదుగా తిరుమల పద్మావతి అతిథి గృ హంలో అందజేశారు. బృందావన పార్థ సారథి 4వ ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ, వివిధ స్థానిక కమిటీల నియామకం, వేదికల ఎంపిక, వసతి, విదేశీ ప్రతినిధుల స్థానిక పర్యాటక ప్రయాణ ఏర్పా ట్ల బాధ్యతలను నిర్వహిస్తారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.