22 July, 2026 | 2:45 AM

గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్

22-07-2026 02:10 AM

సిరిసిల్ల, జూలై -21(విజయక్రాంతి)తెలంగాణ జలసిరి, ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎల్ నినో ప్రభావం,వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయని తెలిపారు. భవిష్యత్తు అవసరాలు, పంటల సాగు, తాగునీరు, భూగర్భ జలాల వృద్ధి కోసం వర్షం నీటిని ఒడిసి పట్టాలని పిలుపు నిచ్చారు.

తెలంగాణ జలసిరి కింద జల సంరక్షణ కోసం చేపట్టనున్న పనులు, లాభాలపై టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్ అసిస్టెంట్లకుఅవగాహన కల్పించాలని సూచించారు.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, పంట కుంటలు (పామ్ పాండ్), ఊట కుంట (పర్కొలేషన్ ట్యాంక్), బోరు బావుల రీచార్జ్ పనులు జిల్లాలోని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫాం పాండ్స్ తో రైతుల పొలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, ఎన్నో లాభాలు ఉన్నాయని తెలియజేస్తూ అవగాహన కల్పించాలని సూచించారు.

అర్హులైన రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫాం పాండ్స్, బోర్ వెల్స్ రీచార్జ్ పనులు చేసుకునేలా చూడాలని సూచించారు.జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, ప్రజల బోర్ వెల్స్ రీచార్జ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బోర్ వెల్స్ రీచార్జ్ తో భూగర్భ జలాలు పెరిగి నీటి ఇబ్బందులు దూరమవుతాయనే విషయాన్ని తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే నీటి వృథాను అరికట్టాలని పేర్కొన్నారు.