22 July, 2026 | 2:36 AM

రూ.10 లక్షల అక్రమ మద్యం ధ్వంసం

22-07-2026 02:08 AM

సుల్తానాబాద్, జూలై 21 (విజయ క్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో గతంలో వివిధ కేసులలో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ట్రాక్టర్ తో తొక్కించి మంగళవారం ధ్వంసం చేశారు.. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ గతంలో వివిధ కేసులలో సుల్తానాబాద్ పరిధిలో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన మద్యం కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు , వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సీజ్ చేసిన మద్యం ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ డిఎస్పి ప్రవీణ్ కుమార్ , సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్ రాథోడ్ , ఎస్త్స్ర చిరంజీవి , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...