4 May, 2026 | 3:13 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ

16-03-2026 02:55 PM

హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ జాతి గౌరవం, నిరంతర స్పూర్తికి నిలువెత్తు ప్రతిబింబంగా, అస్తిత్వం, సంస్కృతికి ప్రతిరూపమైన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి(Telangana Thalli statue)విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభ రోజున జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రితో కలిసి గవర్నర్ అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పునరుద్ధరించిన శాసనమండలి భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు.