24 February, 2026 | 5:43 PM

అభివృద్ధిలో దేశం మెచ్చే స్థాయిలో తెలంగాణ

24-02-2026 03:17 PM

అభివృద్ధి , సంక్షేమం పట్ల అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): అభివృద్ధిలో దేశం మెచ్చే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం  ఉందని, అభివృద్ధి, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో సుల్తానాబాద్ మున్సిపల్ తో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 99 మంది లబ్ధిదారులకు 99,11, 484  (తొంబై తొమ్మిది లక్షల పదకొండు వేల నాలుగువందల ఎనబై నాలుగు రూపాయలు) విలువ గల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్  చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని గత పాలకులు తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని అన్నారు,  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి శ్రీధర్ బాబు సారధ్యంలో 333 రేషన్ కార్డులను అందించామని 824  కుటుంబాలకు లబ్ధి చేకూరిందని నూతనంగా నమోదైన వారు 34 52 కుటుంబాలు కాగా 47 64 నమోదయాయని  తెలిపారు. మండలంలో కొత్తగా రేషన్ కార్డులు 22 152 అందించామన్నారు.

పూర్తిగా కుటుంబ సభ్యుల సంఖ్య 63 836 ఉన్నారని తెలిపారు. మండలంలో ప్రతినెల 357 856 క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో హామీ ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తూ ప్రతి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉండి సుల్తానాబాద్ మండలాన్ని బ్రష్టు పట్టించిందని ఇక్కడ ఉన్న ప్రతి కార్యాలయాన్ని తరలించి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన చరిత్ర గత పాలకులదని అన్నారు.

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని దానికి నిదర్శనమే గ్రామాలలో జరిగిన ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి 70 శాతం సర్పంచ్ అభ్యర్థులు ఘనవిజయం అందించారని అన్నారు.  హైదరాబాదు లో జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ 26 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించింది అన్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ లో 80 శాతం  కాంగ్రెస్  అభ్యర్థులే విజయకేతనం ఎగురవేశారన్నారు. సంక్షేమ పథకాలలో ముందున్నామని మహిళలకు ఫ్రీ బస్సు, రైతులకు సన్న వడ్లకు బోనసు, రైతు బీమా, రైతు భరోసా అందిస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు తోపాటు ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోతున్నామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ లో 21 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం త్వరలోనే చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అయ్యే విధంగా పాలన కొనసాగుతుందని రైతులకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలందరూ కాంగ్రెస్ పాలనలో సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత,మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, , తాసిల్దార్ బషీరుద్దీన్,కాంగ్రెస్ నాయకులు వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు లబ్ధిదారులు  పాల్గొన్నారు.