24 February, 2026 | 7:26 PM

కేటీఆర్ కు ఘనస్వాగతం

24-02-2026 03:13 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పర్యటనకు బయలుదేరిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు మార్గ మధ్యలో సదాశివనగర్ మండలం కుప్రియల్ స్టేజి వద్ద బిఆర్ ఎస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించనున్న కేటీఆర్ కు ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.