23 April, 2026 | 1:48 PM

Breaking News

తెలంగాణ‌లో రెండోరోజు ఆర్టీసీ స‌మ్మె.. మెట్రోలకు పోటెత్తిన ప్రయాణికులు

23-04-2026 12:24 PM

జంటనగరాల్లో రెండో రోజు ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు

ఆర్టీసీ సమ్మె 2026 — Key Facts


సమ్మె ప్రారంభం    : ఏప్రిల్ 22, 2026 అర్ధరాత్రి నుండి

ప్రస్తుత దశ       : రెండో రోజు కొనసాగింపు

మొత్తం డిమాండ్లు  : 32

ప్రధాన డిమాండ్    : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం

ప్రభావిత ప్రాంతాలు : MGBS, JBS, వికారాబాద్, పరిగి

ప్రత్యామ్నాయం     : మెట్రో, MMTS, ప్రైవేట్ ట్రావెల్స్

హైదరాబాద్: తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికుల స‌మ్మె(Telangana RTC workers strike) రెండోరోజుకు చేరింది. జంటనగరాల్లో రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్ డిపోల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రాంగణాల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రయాణికులు లేక ఎంజీబీఎస్, జేబీఎస్ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ సమ్మె కొనసాగుతోందని తెలియక కొందరు ప్రయాణికులు ఎంజీబీఎస్, జేబీఎస్ వెళ్తున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్ లో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.

హైదరాబాద్ రవాణా తాజా అప్‌డేట్లు, ఆర్టీసీ సమ్మె పరిణామాలు నిమిషాల వ్యవధిలో తెలుసుకోవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.

ఆర్టీసీ జేఏసీ మొత్తం 32 డిమాండ్లతో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. వాటిలో ప్రధానమైనది — ఆంధ్రప్రదేశ్ తరహాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని. అలాగే వేతన సవరణ, పెండింగ్ బకాయిలు చెల్లింపు, ఖాళీల భర్తీ, కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత — ఇవన్నీ డిమాండ్ లిస్ట్ లో ఉన్నాయి. మహాలక్ష్మి పథకానికి సరిపడ బడ్జెట్ ఇవ్వకపోవడంతో పాటు కొత్త బస్సులు కొనాలని కూడా జేఏసీ పట్టుపట్టింది.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ — ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అనే రెండు డిమాండ్లు తన పరిధిలో లేవని స్పష్టం చేశారు. మిగతా విషయాలపై చర్చలకు సిద్ధమని తెలిపారు. ఈ వైఖరి వల్ల సమ్మె త్వరగా ముగిసే అవకాశం కనిపించడం లేదు.

బస్సులు రాకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి ప్రధాన బస్టాండ్లకు స్వల్ప స్థాయిలో ఆర్టీసీ అద్దె బస్సులు నడుస్తున్నాయి. బస్సులు బంద్ కావడంతో హైదరాబాద్ లో ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారునగరంలోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్ నుంచి పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు బస్సులు నడుస్తున్నాయి.  సరిపడ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది. డిపోల నుంచి బస్సులను బయటకు తీయకుండా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళన నెలకొంది. పొలీస్ బందోబస్త్ మధ్య బస్సులను బయటకు తీసిన అధికారులు బస్సుకో కానిస్టేబుల్‌ని ఏర్పాటు చేశారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, హైదరాబాద్ తాజా వార్తలు చదవడానికి మా తెలంగాణ వార్తలు విభాగం follow చేయండి.

FAQ

Q1. ఆర్టీసీ సమ్మె ఎందుకు జరుగుతోంది?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వేతన సవరణ చేపట్టాలని సహా 32 డిమాండ్లతో జేఏసీ సమ్మె చేపట్టింది.

Q2. ఆర్టీసీ సమ్మె ఎన్ని రోజులు కొనసాగుతుంది?

ప్రభుత్వం, జేఏసీ మధ్య చర్చలు సత్ఫలితాలు ఇస్తే మాత్రమే సమ్మె ముగుస్తుంది. ప్రస్తుతానికి రెండో రోజు కొనసాగుతోంది.

Q3. సమ్మె సమయంలో హైదరాబాద్‌లో రవాణా ఎలా?

మెట్రో, MMTS రైళ్లు నడుస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. MGBS నుండి పొరుగు రాష్ట్రాలకు పరిమిత బస్సులు నడుస్తున్నాయి.