5 July, 2026 | 6:23 PM

మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే పాయంని కలిసిన పినపాక మండల అధ్యక్షులు పేరం

05-07-2026 05:44 PM

పినపాక,(విజయక్రాంతి): పినపాక మండలానికి నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా పేరం వెంకటేశ్వర్లు మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు నూతన అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని సూచించారు.