2 June, 2026 | 8:51 PM

ఎల్లారెడ్డి పట్టణంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 07:46 PM

ఆర్డీవో ఎంఆర్ఓ ఎంపీడీవో మున్సిపల్ కార్యాలయాల్లో జెండా వందనం

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా వందనం సంబంధిత శాఖ అధికారులు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ రోడ్డ ప్రభాకర్, ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహీరా బేగం, తాసిల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు పార్టీలకు చెందిన మండల అధ్యక్షులు మండల పార్టీ కార్యాలయాల వద్ద జండా వందనం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా వందనం అనంతరం ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎంతో నష్టం వాటిల్లిందని మన తెలంగాణ మనకు ప్రత్యేకంగా ఏర్పడిన అనంతరం తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎంతో న్యాయం చేకూరిందని నీళ్ళు నిధులు నియామకాలు స్వరాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎందరో మహానుభావుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ప్రజా ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో మునుమందుకు సాగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు నాయకులు పలువురు పాల్గొన్నారు