2 June, 2026 | 8:57 PM

Breaking News

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

02-06-2026 07:43 PM

దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దమ్మపేట మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు హజరయ్యారు. ముందుగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించి, జాతీయ, పార్టీ జెండాలను ఆవిష్కరించి కేక్ కట్ చేసి అందరికి తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.