బెజ్జంకి మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
02-06-2026 08:15 PM
బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో మంగళవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.






