3 June, 2026 | 12:02 AM

Breaking News

అక్రమ రవాణాగా ఇసుక.. అధికారుల కన్నులకు మసక!   •   రాష్ట్రంలో తుమ్మిడిహెట్టి హీట్!   •   ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి   •   రైతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్   •   ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారి గంగాధర్!!   •   సాయి సామల చెస్ అకాడమీ సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు   •   శివంపేట మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు!!   •   ఎందరో మహానుభావుల బలిదానాల త్యాగ ఫలం   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్   •   పండుగలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •  

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

02-06-2026 08:14 PM

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి 

బోధన్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు.