ఉద్యమకారుల అమరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా వాయువులు
02-06-2026 08:19 PM
-తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
హుజూర్ నగర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన తొలిదశ మలిదశ ఉద్యమాల్లో ప్రాణత్యాగం చేసిన అమరుల, ఉద్యమకారుల త్యాగ ఫలితమే నేడు మనమంతా అనుభవిస్తున్నామని తెలంగాణ ఉద్యమకారులు అన్నారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరుల య్యారని వారి త్యాగం వల్లే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు, ఉద్యమకారుల నియోజకవర్గ కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ యడ్ల విజయ్ ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్‌నగర్ పట్టణంలో క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తెలంగాణ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉద్యమ నాయకురాలు నూకల జానకి జాతీయ జెండాను ఎగురవేశారు.






