27 July, 2026 | 2:32 AM

వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ఎకరాకు రూ.8 సాయం ఇవ్వాలి

27-07-2026 01:35 AM

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పస్య పద్మ

భూపాలపల్లి టౌన్, జులై 26 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మెట్ట పంటలు వేసుకునే రైతులకు ఎకరాకు రూ.8, వేల ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పస్య పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో ఆదివారం జరిగిన సంఘం 3వ మహాసభల్లో ఆమె మాట్లాడారు.రైతులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకో వాలని, మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు గ్రామాలను పర్యటించి భూసార పరీక్షలు నిర్వహించి పంటలపై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని సూచించారు. డ్రిప్ సాగుకు అవకాశాలు ఉన్న భూముల్లో ప్రోత్సాహం ఇవ్వాలని, బోర్లు, బావుల వద్ద సోలార్ వ్యవస్థలను సబ్సిడీపై ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను తగ్గించాలని కోరారు.

వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు త్రాగు, సాగు నీటి నిర్వహణపై ముందస్తు ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. అలాగే విత్తనాలను సబ్సిడీపై అందించాలని డిమాం డ్ చేశారు.భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చే స్తూ, దేశ రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని కో రారు. రైతుల ప్రయోజనాలను కాపాడే వి ధానాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మామిడాల సమ్మిరెడ్డి, గొంటు చంద్రమౌళి, పైళ్ల శాంతి కుమార్, పరమండ్ల రాజయ్య, పెంట రవి, కుడుదుల వెంకటేష్, నిమ్మల రాజయ్య, ఎండి నబి తదితరులు పాల్గొన్నారు.