పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
02-06-2026 05:12 PM
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీపీ రష్మీ
సిద్దిపేట క్రైం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎఆర్ సుభాష్ చంద్రబాబు, ఇన్‌స్పెక్టర్లు, కమిషనరేట్ సిబ్బంది పాల్గొన్నారు.






