26 July, 2026 | 3:42 PM

నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన

26-07-2026 02:51 PM

ముకరంపుర,(విజయక్రాంతి): డివిజన్‌ లో జరుగుతున్న కమ్యూనిటీ హాల్ అభివృద్ధి, నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కమ్యూనిటీ కమిటీ బాధ్యులతో కలిసి నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన పనులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అధికారులతో, కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ... నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకూడదని నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేసి, త్వరలోనే డివిజన్ ప్రజలకు కమ్యూనిటీ హాల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని యాదగిరి సునీల్ రావు స్పష్టంచేశారు.