బాల్య వివాహాలు జరిపితే కఠిన చర్యలు: రేగోడు ఎస్ఐ పోచయ్య
26-07-2026 03:07 PM
రేగోడు: బాల్య వివాహాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై పోచయ్య అన్నారు. 18 సంవత్సరాలు నిండని వారికి వివాహాలు జరపరాదని గజవాడ గ్రామంలో శనివారం రాత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనాలు నడిపే వారు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు, వ్యవసాయ భూములకు వెళ్లి వచ్చేవారు గుర్తు తెలియని వారు అటకాయించిన చొ నమ్మి మోసపోకూడదని తెలిపారు, అభరణాలపై జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.






