26 July, 2026 | 3:49 PM

సేవా కార్యక్రమాలతో గంప శశాంక్ జన్మదిన వేడుకలు

26-07-2026 02:54 PM

ప్రభుత్వఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంప శశాంక్ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గంప శశాంక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన ప్రజాసేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. జన్మదిన వేడుకల అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటారు.