ఉచిత మెగా వైద్య శిబిరం
ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ 11వ డివిజన్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం జరిగింది. డివిజన్ బీజేపీ నాయకులు పండుగ స్వప్న–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో, డాక్టర్ ఎలగందల శ్రీనివాస్, సహకారంతో ఆదివారం కట్టరాంపూర్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
శిబిరంలో ప్రముఖ జనరల్ లాప్రోస్కోపిక్, లేజర్ సర్జన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ రోగులను పరీక్షించి బ్లడ్ షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, హెర్నియా, హైడ్రోసీల్, వెరికోజ్ వెయిన్స్, డయాబెటిక్ ఫుట్, బ్రెస్ట్ లంప్స్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలకు సంబంధించిన సమస్యలపై ఉచిత వైద్య సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో కోలకాని నరసయ్య, మహేందర్, శేఖర్, శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీల ప్రముఖులు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






