26 July, 2026 | 4:02 PM

సర్ పై అప్రమత్తంగా ఉండాలి

26-07-2026 03:02 PM

పార్టీ కార్యకర్తలకు పిలుపు

మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

కామారెడ్డి,(విజయక్రాంతి): సర్ ఫై పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చేనెల 10 తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. ఆదివారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి మండల, మున్సిపాలిటీ కార్యకర్తల నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అప్రమత్తంగా ఉంటూ అసలైన ఓటర్ల ఓటు హక్కును కాపాడాలని సూచించారు. బిఎల్ఓలు ఇచ్చిన దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి అందజేసే విధంగా చూడాలన్నారు. మూడో తేదీ వరకు పూర్తిచేసిన దరఖాస్తులను బిఎల్ఓకు అందజేయాలన్నారు. 10వ తేదీన లిస్టును పెట్టడం జరుగుతుందన్నారు. లిస్టును చెక్ చేసి అర్హులైన వారి పేర్లు ఉన్నాయా లేవా చూడాలని అన్నారు.