calender_icon.png 9 February, 2026 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ దండోరా ఆవిర్భవ దినోత్సవం

08-02-2026 12:00:00 AM

మాతా రమాబాయి 128వ జయంతి వేడుకలు

సికింద్రాబాద్, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి): గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ అన్నారు. శనివారం  సికింద్రాబాద్ నియోజకవర్గం లాలగూడాలో మాత రమాబాయి అంబేద్కర్ 128వ జయంతి, తెలంగాణ దండోరా 5వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ దండోరా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి, ముఖ్యఅతిథి గా తెలంగాణ దండోరా రాష్ట్ర గౌరవ అధ్య క్షులు దొమ్మాటి శివకుమార్, తెలంగాణ దండోరా విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ హాజరయ్యారు. ఈ సం దర్భంగా బస్తీలోని వృద్ధులను శాలువాతో ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు.