నేపాలి గ్యాంగ్‌లో నలుగురి అరెస్టు
- బంగారం, వెండి, నగదు స్వాధీనం
- పరారీలో ఉన్న వారి కోసం గాలింపు
- వృద్ధ దంపతుల ఇంట్లో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
మేడ్చల్, మే 16 (విజయక్రాంతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ లోని వృద్ధ దంపతుల ఇంట్లో నేపాల్ ముఠా దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం కేసు వివరాలను సీపీ సుమతి వెల్లడించారు. కౌకూర్‌లోని మోహన్స్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసించే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సిపురం (68), తన భార్యతో కలిసి ఉంటున్నారు.
వృద్ధ దంపతులు మాత్రమే ఒంటరిగా ఉంటున్నారనే విషయాన్ని గమనించిన రాజేష్, మీనా అనే నేపాల్ కార్మికులు.. దోపిడీకి వ్యూహం రచించారు. ఇందుకోసం సబీనా అలియాస్ సునీత, చాంగ్, సామ్రాట్, బిస్వాల్, కమల్, జంకర్ అలియాస్ శంకర్ అనే మరికొంతమంది నేపాల్ వ్యక్తులతో కలిసి పథకం వేశా రు. పథకం ప్రకారం మీనా అనే నిందితురాలు సబీనాను ఇంట్లో పనిమనిషిగా చేర్పిం చింది. రాజేష్‌ను ఆమె భర్తగా పరిచయం చే సింది.
గత నెల ఏప్రిల్ 25 నుంచి సరైన సమయం కోసం వేచి చూసిన ఈ ముఠా, మే 11న సర్వెంట్ క్వార్టర్స్‌లో మీనా పుట్టినరోజు వేడుక పేరిట ఒక నాటకానికి తెరలే పింది. ఆ రాత్రి రాజేష్, సబీనా, మీనా, చాం గ్, సామ్రాట్ అనే ఐదుగురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించగా, మిగిలిన నిందితులు బయట కాపలాగా ఉన్నారు. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన నిందితులు వృద్ధ దంపతులను బం ధించారు. వారికి బలవంతంగా మత్తు పదార్థాన్ని తినిపించి స్పృహ తప్పేలా చేశారు.
అనంతరం ప్లాస్టిక్ టేపులు, గుడ్డలతో వారి కాళ్లు, చేతులు కట్టేసి, గడ్డపారలతో అల్మారాలను పగలగొట్టారు. ఇంట్లో ఉన్న సుమా రు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లు, 3,000 యూఎస్ డాలర్ల నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఘటన అనంతరం నిందితులు ఆటో, ద్విచక్ర వాహనాలపై పారిపోయారు. యా ప్రాల్ సమీపంలో ద్విచక్ర వాహనం వదిలి, అక్కడి నుంచి రెండు టాక్సీలలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని దేశం దాటిపో యేందుకు ప్రయత్నించారు.
బాధితుడి ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలోనూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రాత్రి వేళ ఇళ్ల దొంగతనం కేసులో మీనా, రాజేష్లకు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో జరిపి న వేలిముద్రల పరీక్షలో మీనా వేలిముద్రలు సరిపోలాయి. నిందితులను పట్టుకునేందుకు మొత్తం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బెంగళూరు, లక్నో, నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపించారు.
దాదాపు 250కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం, క్షేత్రస్థాయి స మాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించి నిందితులను పట్టుకు న్నారు. శనివారం ఉదయం 10:45 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టేషన్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సునీత అలియాస్ సబీనా (28), బిస్వాల్ అలియాస్ విస్వాల్ (30), కమల్ బహదూర్ చలానే (34), జంకర్ బహదూర్ చలానే అలియాస్ శంకర్ (38) ఉన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.






