17 May, 2026 | 2:46 AM

2029లో బీసీలదే అధికారం

17-05-2026 01:27 AM
  1. జూలై 12న హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ 
  2. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

సూర్యాపేట, మే 16 (విజయక్రాంతి): 2029లో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారిందని ఈ సునామీని ఎవరు ఆపలేరని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్య క్షుడు బూర మల్సూర్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజ్యాధికారం లక్ష్యం గా బీసీ సమాజంలో రాజకీయ చైతన్యం పెరిగిందన్నారు. సింహభాగం ఉన్న బీసీలను పాలకులుగా కాకుండా పాలితులుగా జెం డాలు మోసేవారిగా, ఓట్లు వేసే యంత్రాలుగా అణచివేస్తున్నారన్నారు. జూలై 12న హైదరాబాదులో బీసీల రాజకీయ ప్లీనరీ, ఆగస్టు 7న జాతీయ ఓబిసి సమావేశం, సెప్టెంబర్ లో బీసీల రాజ్యాధికార రథయాత్ర రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు పల్లె నుంచి పట్టణ వరకు రాజకీయ దామాషా  రాజ్యాధికారమే లక్ష్యంగా కొనసాగుతుందన్నారు.

హైదరాబాదులో డిసెంబర్ లో 10 లక్షల మందితో రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర మల్సూర్ గౌడ్, బీసీ ఐకాస చైర్మన్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఉప్పల మధు యాదవ్,బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి గౌడ్,

బీసీ సంక్షేమ సం ఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి నేరెళ్ల దేవరాజు యాదవ్, అసోసియేటెడ్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ యాదవ్, గౌరవ అధ్యక్షుడు పోతు రాజు నరసయ్య, జిల్లా కన్వీనర్ సూర్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.