calender_icon.png 9 February, 2026 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేయర్ గారూ ఆ నిధులేవి?

08-02-2026 12:00:00 AM

పదవి దిగిపోయే వేళ కార్పొరేటర్లకు మొండిచేయేనా!

ఫెయిర్‌వెల్ గిఫ్ట్‌గా ప్రకటించిన రూ.2 కోట్లు ఏమైనట్లు?

10వ తేదీతో ముగుస్తున్న పాలకమండలి గడువు

హామీల అమలులో మేయర్ వైఫల్యం!

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి ౭ (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 ముగియనుండగా, బల్దియాలో తీవ్ర ఉద్రిక్తత, అసహనం నెలకొంది. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగిన మేయర్ గద్వా ల్ విజయలక్ష్మి.. చివరి నిమిషంలో కార్పొరేటర్లను నట్టేట ముంచారన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వెల్లువెత్తుతున్నాయి.

పదవి దిగిపోయే ముందు రూ. 2 కోట్ల నిధులు ఇస్తాం.. వార్డులను అభివద్ధి చేసుకోండి అని కౌన్సిల్ సాక్షిగా మేయర్ ఇచ్చిన హామీ.. ఇప్పుడు అమలుకు నోచుకోకపోవడంతో కార్పొరేటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవీకాలం ముగుస్తున్న వేళ మేయ ర్ చేసిన ప్రకటన కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోయిందా అని నిలదీస్తున్నారు. హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప.. ఆ నిధులు విడుదలయ్యేలా సంబంధిత మంత్రి లేదా అధికారులతో సమన్వయం చేయడంలో మేయర్ ఘోరంగా విఫలమయ్యారని కార్పొరేటర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

కౌన్సిల్‌లో చప్పట్లు, బయట పాట్లు

గత ఏడాది నవంబర్ 25న జరిగిన సర్వసభ్య సమావేశంలో మేయర్ గద్వాల్ విజ యలక్ష్మి ఎంతో ఆర్భాటంగా కార్పొరేటర్లకు నిధుల వరాన్ని ప్రకటించారు. ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో కార్పొరేటర్లంతా సంబరపడిపోయారు. కానీ ఆ సంబ రం మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ రూ.2 కోట్లలో రూ.కోటి నేరుగా కార్పొరేటర్ల ప్రతిపాదనలకైతే, మిగిలిన రూ.కోటి పనులకు జిల్లా ఇన్-ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమోదం తీసుకోవాలని మెలికపెట్టారు.

ఇక్కడే మేయర్ ప్లాన్ బెడిసికొట్టిం ది. కోటి రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్న కార్పొరేటర్లకు మంత్రి దర్శ నం దొరకడం గగనమైపోయింది. మంత్రి అందుబాటులో లేకపోవడంతో సగం ఫైళ్లు పెండిం గ్‌లో పడిపోయాయి. అసలు మంత్రి అనుమతి తప్పనిసరి అయినప్పుడు, ముం దుగా నే వారితో మాట్లాడి కార్పొరేటర్లకు అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన బాధ్యత మేయర్ పై లేదా అని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. 

జల్సాలకే పరిమితమా?

గత ఐదేళ్ల పాలనలో మేయర్ నేతత్వంలోని పాలకమండలి సాధించింది ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆరు వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టి రికార్డు సష్టించామని చెప్పుకుంటున్న మేయర్.. క్షేత్రస్థాయిలో నిధుల కొరతను ఎందుకు తీర్చలేకపోయా రు కార్పొరేటర్లకు ఇన్సూరెన్స్‌లు, విలాసవంతమైన స్టడీ టూర్ల పేరుతో జల్సాలు చేయ డానికి ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలు తీర్చడానికి నిధులు మంజూరు చేయడంలో ఎందు కు లేదని ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీ కార్పొరేటర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. 

స్టాండింగ్ కమిటీల్లో టేబుల్ ఐటమ్స్ పేరు తో గుట్టుచప్పుడు కాకుండా పనులు చక్కబెట్టుకున్నారన్న అపవాదును ఈ పాలకమం డలి మూటగట్టుకుంది. అందెశ్రీ గీతాలాపన, మేయర్ కమిషనర్లతో గ్రూప్ ఫోటోలు దిగి కౌన్సిల్ హాల్ లో పెట్టుకోవాలన్న తీర్మానాలపై చూపిన అత్యుత్సాహం.. అభివద్ధి పనుల నిధులపై చూపి ఉంటే బాగుండేదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. 

కమిషనర్ గది ముందు క్యూ

పదవీకాలం ముగియడానికి కేవ లం 5 రోజులే మిగిలి ఉంది. ఈ సమయంలో నిధు లు మంజూరు కాకపోతే, అవి ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీలో ఉన్న 144 మంది కార్పొరేటర్లలో రోజుకు 30 నుంచి 40 మంది కమిషనర్ కర్ణన్, జోనల్ కమిషనర్ల ఛాంబర్ల ముందు క్యూ కడుతున్నారు. మా ఫైల్ కదిలించండి సారూ అని వేడుకుంటున్నారు. కానీ కమిషనర్ చేతుల్లో ఏమీ లేకపోవడంతో వారు నిస్సహాయత వ్యక్తం చేస్తు న్నారు. ఇంత జరుగుతున్నా మేయర్ మాత్రం మిన్నకుండిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.