17 May, 2026 | 2:49 AM

పంజాబ్‌కు చావోరేవో

17-05-2026 01:24 AM
  1. ప్లే ఆఫ్ బెర్తుపై ఆర్‌సీబీ కన్ను
  2. తీవ్ర ఒత్తిడిలో శ్రేయాస్ అయ్యర్

ధర్మశాల, మే 16: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా చేజారినట్టే. నిజానికి ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ ప్రదర్శన చూసిన వారెవరైనా ఆ జట్టు టైటిల్ గెలవడం ఖాయమనుకున్నారు.

ఎందుకంటే వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచింది. మధ్యలో ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడంతో ఫస్టాఫ్‌లో అసలు ఓటమెరుగని జట్టుగా నిలిచింది. తీరా సెకండాఫ్ ప్రారంభమైన తర్వాత పేలవ ప్రదర్శనతో నిరా శ పరుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. నిజానికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ పంజాబ్ కింగ్స్ ఓట ములకు కారణం. అటు గత మ్యాచ్‌లో చెత్త బౌలింగ్ కూడా పరాజయానికి కారణమైంది.

భారీస్కోరు చేసిన బౌలింగ్ పరంగా నిరాశపరిచింది. బ్యాటింగ్‌లో ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ సమిష్టిగా రాణిస్తే పంజాబ్ కు గెలుపు అవకాశాలుంటాయి. బౌలింగ్‌లో మాత్రం మెరుగవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఫీల్డింగ్‌లో కూడా క్యాచ్‌లు జారవిడిచే బలహీనతను అధిగమించాల్సిందే. మరోవైపు డిఫెం డింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పం జాబ్‌పై గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. అలాగే టాప్ 2లో లీగ్ స్టేజ్‌ను ముగించే అవ కాశం కూడా ఉంటుంది.

గత మ్యాచ్‌లో కోల్ కతాపై విరా ట్ కోహ్లీ సెంచరీతో వీరవిహారం చేశాడు. పడిక్కల్, పటిదార్ తో పాటు టిమ్ డేవిడ్ , కృనాల్ పాండ్యా వంటి వారితో బ్యాటింగ్ అత్యంత బలంగా ఉంది. బౌలింగ్‌లోనూ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. ఈ వెటరన్ పేసర్ 12 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. అతనితో పాటు హ్యాజిల్ వుడ్, రసి క్ సలామ్ దార్, కృనాల్ పాండ్యా కూడా రాణిస్తున్నారు. ఇక ధర్మశాల పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో మరోసారి పరుగుల వరద ఖాయం.

తుది జట్ల అంచనా 

పంజాబ్ : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రే యాస్ అయ్యర్, స్టోయినిస్, సూర్యాన్ష్, మార్కో జెన్సన్, ఫెర్గ్యూసన్, అర్షదీప్ సింగ్, చాహల్, యశ్ ఠాకూర్

బెంగళూరు : కోహ్లీ, బెథెల్, పడిక్కల్, పటిదార్(కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హ్యాజిల్‌వుడ్