12 May, 2026 | 8:59 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ

23-02-2026 01:24 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది. వచ్చే మూడు నెలలపాటు తాగునీటి సరఫరా, ఆరోగ్యం, విద్య, భూసేకరణ, భూముల కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 5 సాగునీటి ప్రాజెక్టులకు సవరించిన అంచనాలపై చర్చించనున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు భూముల కేటాయింపుపై చర్చించనున్నారు.