12 May, 2026 | 10:00 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కోఠిలో ఆశా వర్కర్ల ధర్నా

23-02-2026 01:12 PM

హైదరాబాద్: కోఠిలోని డీఎంహెచ్ఓ(DMHO) కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు(ASHA workers protest) కోఠిలో ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లు ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆశా వర్కర్లకు వేతనం రూ. 18 వేలకు పెంచాలని వర్కర్ల డిమాండ్ చేస్తున్నారు.  ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. ధర్నాకు వస్తున్న ఆశా వర్కర్లను(ASHA workers) పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమకు మూడు నెలల నుండి జీతాలు ఇవ్వడంలేదని ఆశా వర్కర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 18 వేలు కనీసం వేతనం, రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో(Telangana Assembly Budget) నిధులు పెంచాలని, కేంద్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు పెంచిన రూ.1500 పారితోషికాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్, పోలీసుల మధ్య తోపులాటలో ఆశా వర్కర్ స్పృహతప్పి పడిపోయింది.