నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి
భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్
మే 16 నుండి పనులు బంద్
జవహర్ నగర్,(విజయక్రాంతి): నిర్మాణరంగంలో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగినందున ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నిర్మాణదారులకు నూతన ధరలు చెల్లించాలని జవహర్ నగర్ నిర్మాణ రంగ కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, పరిధిలోని కీసర సర్కిల్, జవహర్ నగర్ బాలాజీ నగర్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగంలో ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం, పెరిగిన నిత్యావసర ధరలు ఇంటి అద్దెల దృష్ట్యా పాత ధరలకు పనులు చేయడం సాధ్యం కాదని కార్మిక సంఘం,అధ్యక్షులు కొయ్యడ వెంకటేష్,ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్,స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లను తెలియజేశారు ప్రధాన డిమాండ్లు, పెరిగిన ధరల వివరాలు నిర్మాణ రంగానికి సంబంధించి సెంట్రింగ్, ఇసుక, కంకర, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మెటీరియల్ ధరలు పెరగడం వల్ల కాంట్రాక్టర్లు భారీగా నష్టపోతున్నారని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో నూతన ధరలను ఈ క్రింది విధంగా డిమాండ్ చేస్తున్నారు:
క్వాలిటీ 1 (మెటీరియల్ తో కలిపి): చదరపు అడుగుకు 2,600
క్వాలిటీ 2 (మెటీరియల్ తో కలిపి) చదరపు అడుగుకు 2,300
కేవలం లేబర్ ఛార్జీ: చదరపు అడుగుకు రూ,550
మే 16 నుండి రెండు వారాల పాటు సమ్మె
తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ నెల 16/05/2026 నుండి రెండు వారాల పాటు పనులు నిలిపివేస్తున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా గల్లీ గల్లీ తిరుగుతూ అవగాహన కల్పిస్తామని, భవన యజమానులు అనుభవం కలిగిన వారు తమ కష్టాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. పెరిగిన ధరల వల్ల చేసిన కష్టానికి గిట్టుబాటు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. న్యాయమైన ధరలు లభించే వరకు మా పోరాటం ఆగదన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులుఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోయాడ వెంకటేష్, అధ్యక్షులు చిన్నపురం యాదయ్య, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, ఉపాధ్యక్షులు మరాటి బాబు, రమణారెడ్డి, కోశాధికారి కోట్ల చెన్నారెడ్డి, మాధవ్, ఏ.ఎఫ్.టి.యు రాష్ట్ర నాయకులు వై. మల్లేష్, శ్రీను, వెంకటేష్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.






