17 July, 2026 | 12:50 AM

భారీగా తగ్గనున్న ఓటర్లు!

17-07-2026 12:33 AM

కరీం’నగర్’ పై ఎస్‌ఐఆర్ ఎఫెక్ట్

బోగస్, నకిలీ ఓట్ల ఏరివేత

60 నుంచి 70 వేల వరకు తొలగిపోయే అవకాశం

కరీంనగర్, జూలై 16, (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్ర త్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ ‘సర్’ గడువు పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ తుది గడువు: ఆగస్టు 3 కాగా ముసా యిదా ఓటర్ల జాబితా ప్రకటన ఆగస్టు 10న ఉంటుంది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ఎంత పొదగించినా ఎస్ ఐ ఆర్ వల్ల ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.  నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 3,40,580 ఓటర్లు ఉండగా, పురుషులు 1,69,679 మంది, మహిళలు 1,70,858 మంది, ఇతరులు 43 మంది ఉన్నారు.

ఎస్ ఐ ఆర్ వల్ల 20 శాతం మేర 60 నుండి 70 వేల ఓట్లు తగ్గనున్నాయి.  ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ వల్ల కరీంనగర్ లో  ఓట్లు తగ్గనున్నాయనే అంశం చర్చనీయాంశంగా మారిం ది. ప్రధానంగా నకిలీ, బోగస్, ఒకే ఇంట్లో అక్రమంగా నమోదైన ఓటర్ల తొలగింపు ప్ర క్రియ కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా జూన్ 24 నుండి జూలై 25 వరకు ఈ ప్రత్యేక ఓటర్ల సవరణ  ప్రక్రియ ఉండగా పార్టీల విన్నపం మేరకు పొదగించారు..

ఒకే ఓటరు వేర్వేరు ప్రాంతాలలో లేదా నియోజకవర్గాలలో రెండుసార్లు ఓటు కలిగి ఉంటే, దర్యాప్తు చేసి ఒకదాన్ని తొలగిస్తున్నారు. మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను జాబితా నుండి తొలగిస్తున్నారు. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరి ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తప్పుడు అడ్రస్ లతో ఉన్న ఓట్లు రద్దవుతున్నాయి. బూత్ స్థాయి అధికారులు  ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాల  ద్వారా వివరాలను సేకరిస్తున్నారు.

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ స్వయంగా జ్యోతినగర్, మంకమ్మతోట, రేకుర్తి వంటి డివిజన్లలో పర్యటించి పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించా లని ఆదేశించారు. ఓటర్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు సాంకేతిక లోపాలు, నెట్వర్క్ సమస్యలు తలెత్తుతుండటంతో సర్వే కొంత మందకొడిగా సాగుతోంది. ఓటర్ కార్డులోని పేరు, ఆధార్ కార్డులోని పేరు స్పెల్లింగ్స్ వేర్వేరుగా ఉండటంతో ఆన్లైన్ అప్లోడింగ్ ఆలస్యమవుతోంది. ఓటర్లు కూడా ఎన్యూమరేటర్ ఫారం ఎలా నింపాలో తెలియక తికమక పడుతున్నారు.

దీంతో ఫారాలు నింపి బిఎల్‌ఓలకు అందించడంలో ఆలస్యం అవుతున్నది.ప్రజాప్రతినిధులు, పార్టీల భాగస్వామ్యం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి, ఏఐఎంఐఎం సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవెల్ ఏజెంట్లను  అప్రమత్తం చేసి ఓటర్లకు ఫారాలు నింపడంలో, ఆన్లైన్ నమోదులో సహాయపడేలా క్షేత్రస్థాయి శిబిరాలను నడుపుతున్నాయి. ఆయా డివిజన్ల కార్పొరేటర్ లు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి వేగవంతం చేశారు.