మావోయిస్ట్ విముక్త రాష్ట్రంగా తెలంగాణ
- ఉన్న ఆరుగురు ఈ ప్రాంతంలో లేరు
- మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి
- ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తాం
- డీజీపీ శివధర్‌రెడ్డి
- కర్రెగుట్టలలో పర్యటించిన డీజీపీ
మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రమ ని, ఈ ప్రాంతంలో మావోయిస్టులు లేరని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే నక్సలిజాన్ని రూపు మాపడం సాధ్యమైందన్నా రు. మంగళవారం తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఇంకా ఆరుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, అయితే వారు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేరని పేర్కొన్నారు.
మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని డీజీపీ సూచించారు. ఈ ప్రాంతం లో ఉన్న ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, వారికి మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇంతకాలం అభివృద్ధికి దూరం గా నిలిచిన ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాం తాన్ని ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ముందుకు సాగుతామన్నారు.
పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఇంతకాలం అభివృద్ధికి దూరంగా నిలిచిన కర్రెగు ట్టల ప్రాంతాన్ని వెంకటాపూర్, ములుగు పట్టణాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. కర్రెగుట్టల ప్రాంతం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటివరకు ఉన్న అభివృద్ధికి ఆటంకం తొలగిపోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో మారుమూల కర్రెగుట్టల ప్రాంతానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధికి బాటలు వేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ ప్రకటించారు.
కర్రెగుటల ప్రాంతా న్ని ఇత ర ప్రాంతాలతో అనుసంధానించే విధంగా రోడ్లు, మౌలిక వసతులు, రక్షణ కల్పిస్తామని చెప్పారు. తీవ్రవాదం ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో అభివృద్ధి కావడానికి ప్రభుత్వాల కృషితో అధికారులు ముం దుకు సాగుతున్నారన్నారు. చట్టానికి లోబడి కర్రెగుట్టల ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా డీజీపీ, అటవీ శాఖ పీసీసీఎఫ్ కర్రెగుట్టలోని పామూనూరు బేస్ క్యాంప్ సమీపంలో పోలీస్ ఔట్ పోస్టును, ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలై వ్ అనే కార్యక్రమాన్ని కాఫెడ్ మైదానంలో నిర్వహించగా డీజీపీ హాజరై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం పోస్టర్లు ఆవిష్కరించారు. అనం తరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబరాన్ని డీజీపీ ప్రారంభించారు.
అలాగే వివిధ నిత్యావసర వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన భారీ బందోబస్తు మధ్య డీజీపీ, పీసీసీఎఫ్ పర్యటన సాగింది. కార్యక్రమంలో గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీపీ అని ల్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీ పి సుమతి, సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.




