పరిగిలో మరో దమనకాండ
మళ్లీ సీఎం అవుతానని రేవంత్ పగటి కలలు కంటున్నాడు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే..
ప్రతిపక్ష హోదా కూడా దక్కదు
దళితుల భూములపై దండయాత్ర ఎందుకు?
మాజీమంత్రి హరీశ్ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): పరిగిలో దళితులు, పేదవర్గాల భూములపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎందుకు దండయాత్ర చేస్తున్నదో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిగిలో మరో దమనకాండకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. మళ్లీ గెలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ మాత్రమే దక్కుతుందని చెప్పారు. వచ్చేది రామ రాజ్యం.. కేసీఆర్ ప్రభుత్వమని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న హరీశ్‌రావును నార్సింగ్ పోలీస్ అకాడమీ కూడలి వద్ద పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు.
అంతకుముందు హరీశ్‌రావు నివా సం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయన బయటకు రాకుండా అన్ని మార్గాలను మూసివేశారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసం వద్ద, శంషాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద మాట్లాడారు. రేవంత్‌రెడ్డి పాల నలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు కనీసం ప్ర శ్నించవద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారని, ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు అంటున్నారని ధ్వజమెత్తారు.
తమ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. హైదరాబాద్ చుట్టుప క్కల ప్రాంతాలైన వికారాబాద్, భువనగిరిలలో ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూ ములు ఉంటే, అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అం టూ నోటిఫికేషన్లు ఇస్తున్నారని చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూ ములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
ప్రజాస్వామ్యం, ప్రశ్నించే హక్కు అని మాట్లాడే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న కళ్లాపూర్ వద్ద టెంట్లను పీకేయడం, మహిళలను అరె స్టు చేయడం ప్రజాపాలన కాదని, ఇది భక్షక పాలన అని ధ్వజమెత్తారు. నాడు ఇందిరమ్మ పంపిణీ చేసిన భూములను, నేటి ఇందిరమ్మ పాలనలో గద్దల్లా వాలి లాక్కోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టూనే తిరుగుతున్నాయని, మూసీ, హైడ్రా, లగచర్ల నుంచి పరిగి వరకు పేదల ఇళ్లు, భూములపైనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూములను వదిలేసి, పేదల పొట్ట కొట్టి సాగు భూములను సేకరించడం వెనుక భారీ కుట్ర ఉందని విమర్శించారు. 22 నిషేధిత జాబితాను తక్షణమే రివ్యూ చేసి ఎత్తి వేయాలని, ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇచ్చేవరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆపదని స్పష్టంచేశారు. వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ఉన్నా, అది జిల్లాకు శాపంగా మారిందని, ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టి కొట్టే ప్రయ త్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీలకు భూ ములపై పూర్తి హక్కులు కల్పిస్తామని, ఒకవేళ ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తే పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ నేడు అందుకు విరుద్ధంగా ఎకరాకు కోటి రూపాయల విలువ ఉన్న భూమిని కేవలం రూ.10 లక్షలకో, రూ.20 లక్షలకో గుంజుకుంటున్నారని ఆరోపించారు. పరిగిలో ఇండ స్ట్రియల్ పార్క్ పేరిట రైతులు భూ ములు కోల్పోతున్నారని, తాము భూ ములు ఇవ్వలేమని వారు కన్నీరుమున్నీరవుతున్నారని వెల్లడించారు. పోలీ సులు తనను అడ్డుకోలేరని, ఖచ్చితంగా పరిగి వెళ్లి తీరుతానని హరీశ్‌రా వు స్పష్టంచేశారు.




