8 April, 2026 | 2:49 AM

గుప్పుమన్న డ్రగ్స్

08-04-2026 01:00 AM
  1.   63లక్షల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం
  2. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సహా ఐదుగురి అరెస్ట్
  3. చిలకలగూడ, సనత్‌నగర్, ఆదిభట్ల పోలీసుల దాడి

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నగరంలో డ్రగ్స్ మాఫియాపై హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్ (హెచ్-న్యూ) కఠిన చర్యలు చేపట్టింది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చిలకలగూడ, సనత్‌నగర్, ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ల సిబ్బంది నిర్వహించిన సంయుక్త దాడుల్లో ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్, ఒక స్థానిక పెడ్లర్, ముగ్గురు సబ్-పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.63.65 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు, మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

చిలకలగూడ కేసులో 115 గ్రాముల ఎండీ ఎంఏ, సనత్‌నగర్ కేసులో 1005 గ్రాముల హాష్ ఆయిల్, ఆదిబట్ల కేసులో ఎక్స్ టీసీ పిల్స్, ఓజీ, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తు పదార్థాలు పట్టుబడ్డా యి. దర్యాప్తులో భాగంగా నిందితులు సోష ల్ మీడియా, ‘సెషన్స్’ వంటి యాప్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొరియర్ సేవలు, మధ్యవర్థుల ద్వారా నెట్‌వర్క్ విస్తరించి నగరంలో వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్టు వెల్ల డైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. నిందితుల్లో కొందరు విద్యార్థులు, ప్రైవే ట్ ఉద్యోగులు ఉండగా, చెడు సావాసాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాల కారణంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు తేలింది. కొందరికి పూర్వ నేర చరిత్ర కూడా ఉంది. డ్రగ్స్ సమస్యపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్ల ల ప్రవర్తనను గమనించాలని హెచ్-న్యూ విజ్ఞప్తిచేసింది.

డ్రగ్స్‌కు సంబంధించిన సమా చారం ఉంటే 8712661601, 8712661613, 8712661614 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్లు బీ వెంకట్, ఎస్ బాలస్వామి, ఎస్‌ఐలు సీ వెంకట రాములు, బీ మనోజ్‌కుమార్, స్థానిక పోలీసులతో కలిసి పాల్గొన్నారు