8 April, 2026 | 3:49 AM

పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి

08-04-2026 01:53 AM
  1. అమరావతికి చట్టబద్ధత సరే, విభజన హామీలేమాయే?

భారత్ జోడో యాత్రతోనే కుల సర్వేకు బీజం

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కృష్ణానది నీటి వాటాను సంపూ ర్ణంగా వినియోగించుకునేలా కేంద్రం పాలమూరు  ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ డిమాండ్‌చేశారు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ డీసీసీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, సీడబ్ల్యుసీ మెంబర్ వంశీచందర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహే శ్‌కుమార్ మాట్లాడుతూ.. కరువు కాటకాలతో అల్లాడిన ఈ పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. కేంద్ర ప్రభు త్వం ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించింది కానీ, పాల మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు.

విభజన హామీలను సైతం కేంద్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. దేశంలో సమైక్యత, సమానత్వం, సో దర భావం పెంపొందించాలన్న లక్ష్యంతో రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారని, ఈ క్రమంలో రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి అనేక సమస్యలను గుర్తించారని, అందులో భాగంగానే కులగణనకు బీజం పడిందన్నారు.

వాటి ఆధారం గానే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో పొందుపరిచిన బిల్లును కేంద్రం తొక్కి పట్టిందన్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీని గుర్తించారని తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని విమర్శించారు. అమెరికాలోని కొలంబి యా బిజినెస్ స్కూల్లో కూడా కేటీఆర్ తెలంగాణ అభివృద్ధిపై పచ్చి అబద్ధాలు మాట్లా డారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయని, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్, కవిత, సంతోష్‌రావుల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి జూప ల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పాల్గొన్నారు.