5 August, 2026 | 2:19 AM

కొలంబో చేరుకున్న టీమిండియా

05-08-2026 12:00 AM
  1. జట్టుతో పాటు వెళ్లని సాయిసుదర్శన్
  2. శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్
  3. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు కీలకం

ముంబై, ఆగస్టు 4 : పది రోజుల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ అంతర్జాతీయ సిరీస్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం కొలంబోకు బయలుదేరింది. ముంబై ఎయిర్‌పోర్టు నుంచి కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ సారథ్యంలోని భార త టెస్ట్ జట్టు బయలుదేరిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే 15 మంది జాబితాలో సాయి సుదర్శన్ పేరు ఉన్నా అతను జట్టుతో పాటు వెళ్ల లేదు.

దీంతో సాయి సుదర్శన్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకున్నా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. ఇప్పటికే గా యాల కారణంగా పలువురు కీలక ఆటగాళ్లు లంకతో సిరీస్‌కు దూరమయ్యారు. స్టార్ పే సర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుంద ర్, నితీష్ కుమార్ రెడ్డి గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో భారత పేస్ ఎటాక్‌లో ప్రసిద్ధ కృష్ణ, సిరాజ్, అకీబ్ నబీ కీలకం కానున్నారు.

ఇదిలా ఉంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు ఈ సిరీస్ కీలకంగా మారింది. శ్రీలం కపై 2-0తో గెలిస్తే భారత్ డబ్లూటీసీ ఫైనల్ రేసులో ఉంటుంది. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భా రత్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడి 4 గెలి చి, 4 ఓడిపోగా, ఒకటి డ్రాగా ముగిసింది.

లంకతో టెస్టులకు భారత జట్టు

గిల్ (కెప్టెన్), కె.ఎల్. రాహుల్ (వైస్ కెప్టెన్), జైస్వాల్, పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), జడేజా, కుల్దీప్ యాద వ్, మానవ్ సుతార్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్, ఆకిబ్ నబీ, సాయి సుదర్శన్

షెడ్యూల్ 

ఆగస్టు 7-9 :  వార్మప్ మ్యాచ్ (కొలంబో)

ఆగస్టు 15-19 : తొలి టెస్ట్ (గాలె)

ఆగస్టు 23-27 : రెండో టెస్ట్ (కొలంబో)