5 August, 2026 | 2:19 AM

గంభీర్‌ X సీనియర్లు

05-08-2026 12:00 AM

భారత క్రికెట్ జట్టులో అంతా సరిగానే ఉందా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారా... అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. తాజా పరిణామాలు చూస్తుంటే డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్లు, గంభీర్ మధ్య లుకలుకలు తీవ్రస్థాయిలో ఉన్నట్టు అర్థమవుతోంది. కోచ్ గంభీర్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సీనియర్లు బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 

  1. హెడ్ కోచ్‌పై బీసీసీఐకి ఫిర్యాదు
  2. ఓటములకు గంభీర్ బాధ్యత తీసుకోడా ?
  3. తమనే టార్గెట్ చేయడంపై సీనియర్ల అసంతృప్తి
  4. త్వరలో బీసీసీఐ సమీక్ష 

ముంబై, ఆగస్టు 4 : వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ టీమిండియాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ క్రికెటర్లు హెడ్‌కోచ్ గంభీర్‌పై బోర్డు పెద్దలకు ఫిర్యాదు చేశారు. జట్టు పరాజయాలకు గంభీర్ బాధ్యత తీసుకోవడం లేదనీ, తమనే టార్గెట్ చేస్తున్నాడన్నది సీనియర్ల మాట. ఇదే మాటను బోర్డు పెద్దల ముందు ఉంచినట్టు సమాచారం. జట్టు ఓడిపోయినప్పుడు కోచ్‌గా తాను బాధ్యత తీసుకోకుండా, ఆటగాళ్లను నిందిస్తున్నాడనేది సీనియర్ల ప్రధాన ఆరోపణ.

అలాగే చాలా రోజులుగా తమ ఫ్యూ చర్ విషయంలోనూ గంభీర్ అనుసరిస్తున్న విధానాలు సైతం సీనియర్లకు నచ్చడం లేదు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లు గంభీర్ తీరు నచ్చకనే రిటైర్మెంట్ ఇచ్చేసారన్నది చాలా మందికి తెలుసు. ప్రస్తుతం కోహ్లీ, రోహి త్ వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నా వచ్చే ప్రపంచకప్ కు జట్టులో ఉంటారో లేదో తెలియని పరిస్థితి. దీంతో మిగిలిన సీనియర్లు కూడా ఇదే విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది.

బీసీసీఐ పెద్దలను కలిసిన సీని యర్లు వీటిపైనే ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం. ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసిన ట్లు క్రిస్‌బ్లాగర్ పేర్కొంది. గంభీర్ కోచింగ్ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియ ర్ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్ మండలి వద్ద అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమేనని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. సీనియర్ల ఫిర్యాదుపై బీసీసీఐలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది.

కొందరు సీనియర్ల వాదనతో ఏకీభవిస్తూ గంభీర్ శైలిపై అసంతృప్తి వ్య క్తం చేయగా, మరికొందరు అతనికి మద్ధతుగా నిలిచినట్టు బోర్డు వర్గా లు చెబుతున్నాయి. రెండేళ్ల క్రితం ద్రవి డ్ పదవీకాలం ముగిసిన త ర్వాత గంభీర్‌ను బీసీసీఐ ఏరికోరి తీసుకొచ్చింది. అయితే గం భీర్ హయాంలో భారత జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏం లేదు. టీ20 ఫార్మాట్‌లో ఛాంపియన్లుగా నిలిచినా టెస్టుల్లో మాత్రం దిగజారింది.  ఒకవేళ శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోతే మాత్రం టెస్ట్ కోచ్‌గా గంభీర్ భవిష్యత్తు సందిగ్ధంలో పడినట్టేనని భావిస్తున్నారు.